Monday, March 25, 2019

రేమద్దుల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ...

రేమద్దుల స్కూలు 2018-19 సం.10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు సభ వారి ఫోటోలు...విద్యార్థులకు హల్ టికెట్స్ అందిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 60 మంది విద్యార్థిని,విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ...Thursday, March 7, 2019

అట్టహాసంగా... రేమద్దుల లో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు...

వివిధ జిల్లాల నుండి 11 ఎద్దుల జతలు పాల్గొన్నాయి.
మహాశివరాత్రి సందర్భంగా రేమద్దుల లో రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో బండలాగుడు  పోటీలు 05.03.2019 నిర్వహించారు. రేమద్దుల సర్పంచ్ మంజుల తిరుపతయ్య గారు ప్రారంభించారు.
 ఈ పోటీలలో గద్వాల జిల్లా శ్రావణ గండ్ల చక్రధర్ గౌడ్ ఎద్దులు 3927 ఫీట్లు లాగి మొదటి బహుమతి పొందాయి. గద్వాల జిల్లా ఇందువాసి వీరేశం గౌడ్ ఎద్దులు 3750 ఫీట్లు లాగి రెండో బహుమతి పొందాయి. నాగర్ కర్నూల్ జిల్లా చంద్రకల్ వెంకటేశ్వరరావు చెందిన ఎద్దులు 3582 ఫీట్లు లాగి మూడో స్థానం గెలుచుకున్నాయి. 
ఈ పోటీలలో ఉపసర్పంచి రాంబాబు, రైతు మిత్ర సభ్యులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Friday, March 1, 2019

రేమద్దుల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం...

రేమద్దుల గ్రామంలో 26.02.2019 న ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థులు, ఉపాధ్యాయులు జ‌రుపుకున్నారు.  మోటూరి తిరుపతయ్య గారు, ఉపసర్పంచ్ గంధం రాంబాబు గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు తదితరులు పాల్గొన్నారు.     
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయులు అందరు కలిసి నూతన సర్పంచి , ఉపసర్పంచ్ లను శాలువ మరియు పూలమాలతో సత్కరించారు. 
Sunday, February 17, 2019

స్వయం పరిపాలన దినోత్సవం ... రేమద్దుల గ్రామంలో

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేమద్దుల గ్రామంలో 13.02.2019 న
2018-19 బ్యాచ్వి ద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం జ‌రుపుకున్నారు. ఈ కార్యక్ర‌మంలో భాగంగా విద్యార్థులు స్వయంగా పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మోటూరి మంజుల గారు, మోటూరి తిరుపతయ్య గారు ముఖ్య అతిధులుగా హాజరయినారు.విద్యార్థులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని లత గారు , సర్పంచి మోటూరి మంజుల గారు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచి గెలిచిన వారికీ శుభకాంక్షలు తెలియజేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు మాట్లాడుతూ, స్కూల్ కొత్త భవనానికి నిధులు మరియు ఇంగ్లీష్ మీడియం గురుంచి విద్యా వాలంటీర్స్ ఏర్పాటు చేయడానికి సహకరించవలిసిందిగా సర్పంచిని కోరడం జరిగింది.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయులు అందరు కలిసి నూతన సర్పంచిని శాలువ మరియు పూలమాలతో సత్కరించారు.
Wednesday, February 13, 2019

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని బహూకరించారు....

రేమద్దుల గ్రామంలో పదవ తరగతి విద్యార్థులకు 2005 - 06 సంవత్సరపు పూర్వ విద్యార్థులు పరీక్ష సామాగ్రిని బహూకరించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎం లత గారు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు రాజేందర్, రాములమ్మ, చంద్రయ్య, ఒరే రాములు బాలమ్మ, రామచంద్రయ్య లు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులకు హెచ్ఎం లత గారు అభినందనలు తెలియజేశారు.Saturday, February 2, 2019

రేమద్దుల నూతన గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారము...

రేమద్దుల నూతన గ్రామ సర్పంచ్ గా మోటూరి మంజుల తిరుపతయ్య గారి
 ప్రమాణస్వీకారణమహోత్సవం...02.02.2019Thursday, January 31, 2019

రేమద్దుల గ్రామ సర్పంచ్ గా టిఆర్ఎస్ విజయం...

రేమద్దుల గ్రామ సర్పంచ్ గా (2019)
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోటూరి మంజుల గారు బిజెపి మద్దతుతో విజయం సాధించారు. 
సి.పి.ఎం. పార్టీ అభ్యర్థి గుంటి పద్మ గారి పై 314 ఓట్ల అధిక్యం తో విజయం సాధించారు. 
నూతన సర్పంచ్ మోటూరి మంజుల గారికి శుభాకాంక్షలు....

రేమద్దుల మాజీ సర్పంచులు వారి పార్టీలు,  వివరాలు...
2013 మీ దిండ్ల నాగమ్మ  ( కృష్ణయ్య )  -  సిపిఎం
2007 పోతే దార్ యాదగిరి చారి (స్వామి ఆచారి) - కాంగ్రెస్
...  రేగు చెట్టు అలివేల ( చంద్రయ్య ) - కాంగ్రెస్
...  మహమ్మద్ జబ్బార్  - సిపిఎం
...  ఇట్టే రామ్ రెడ్డి - కాంగ్రెస్