Friday, October 11, 2019

పూర్వపు విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం...

రేమద్దుల స్కూలు (పాన్ గల్ మండలం) 2001-02 బ్యాచ్‌ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం 07.10.2019 న ఘనంగా జరిగింది. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను మరొసారి వారు గుర్తుచేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినందుకు మీకు ప్రత్యేక అభినందనలు. మన స్కూల్ ఆభివృద్దికి, మన పూర్వపు విద్యార్దులు అందరూ తోడ్పడాలి...




Friday, September 6, 2019

రేమద్దుల ఉపాధ్యాయులకు వనపర్తి జిల్లా లో 'బెస్ట్ టీచర్ అవార్డ్' లు...

రేమద్దుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లతాదేవి గారు, 
రేమద్దుల పూర్వపు విద్యార్థి, 1991-92 బ్యాచ్ మీత్రుడు బస్తీరాం గారు 'ఉపాధ్యా దినోత్సవం' సందర్బంగా వనపర్తి జిల్లా లో  'బెస్ట్ టీచర్ అవార్డ్' అందుకున్నందుకు ప్రత్యేక అభినందనలు. 
మునుముందు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక శుభాకాంక్షలు.

                 భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులే సమాజ నిర్దేశకులు. విద్యార్థులలో మరింత నైపుణ్యాన్ని పెంపొందించాలని, సమాజ అభివృద్ధికి మరింత తోడ్పాటును ఇవ్వాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరింతమంది ఉపాధ్యాయులు మంచి కృషి చేసి అవార్డులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం.  





Wednesday, June 5, 2019

రేమద్దుల ఎంపీటీసీ టిఆర్ఎస్ విజయం ...

రేమద్దుల గ్రామ ఎంపీటీసీ : 
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పత్తికొండ కరుణాకర్ రెడ్డి గారు విజయం సాధించారు.
 సి.పి.ఎం. పార్టీ అభ్యర్థి మోటూరి వేణుగోపాల్ గారి పై 178 ఓట్ల అధిక్యం తో విజయం సాధించారు. 

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పత్తికొండ కరుణాకర్ రెడ్డి గారికి 1517
సి.పి.ఎం. పార్టీ అభ్యర్థి మోటూరి వేణుగోపాల్ గారికి 1339
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెంబర్ రాములు గారికి 91


పత్తికొండ కరుణాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు....


Tuesday, June 4, 2019

రేమద్దులలో CPI(M) నూతన పార్టీ కార్యాలయం...

వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమద్దుల గ్రామములో CPI(M)నూతన పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర CPI(M)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు 28.05.2019 న ప్రారంభించారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులు B వెంకట్ గారు, జాన్ వెస్లీ గారు, కిల్లే గోపాల్ గారు, అలాగే ప్రజా వాగ్గేయ కళాకారుడుగోరేటి వెంకన్న గారు, వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ గారు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.






Tuesday, May 21, 2019

పాన్ గల్ మండలంలో మొదటి స్థానము ..

రేమద్దుల స్కూలు 10వ తరగతి 2018-19 బ్యాచ్ రామకృష్ణ కు 9.5, శిరీష 9.3 పాయింట్స్ సాదించారు. పాన్ గల్ మండలంలో మొదటి స్థానము సాదించారు.. రేమద్దుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 89 శాతం ఉత్థీర్ణత సాదించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారికి, ఉపాధ్యాయులకు, రామకృష్ణ కు, 
శిరీష కు, వారి కుటుంబ సభ్యులకు మనందరి తరపున శుభాకాంక్షలు...






Sunday, May 12, 2019

రేమద్దుల ఎంపీటీసీ ఎన్నికలు...

రేమద్దుల ఎంపీటీసీ ఎన్నికలు...  ...
దయచేసి అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకొని ఓటేయమని మిమ్మల్ని కోరుతున్నాము. ఎన్నికల సమయంలో ఎరవేసే డబ్బు, మందు, తాత్కాలిక మైనవేగాని, శాశ్వతమైనవి కాబోవు. మన గ్రామ అభివృద్ధి, మన పల్లెల భవిష్యత్తు మాత్రం శాశ్వతమైనవని మరవకండి. జరిగే ఎన్నికల్లో అసమర్థులను, అవినీతిపరులను, ప్రజా సమస్యలపట్ల అవగాహణ, శుద్ధిలేని వారిని ఓడించండి. సమర్థులను, నీతిమంతులను, ప్రజాసేవకులను గెలిపించండి.

రేమద్దుల గ్రామ ఎంపీటీసీ ( 2019) : 

సి.పి.ఎం,టిఆర్ఎస్ పార్టీల మద్య పోటాపోటి 
సి.పి.ఎం. పార్టీ అభ్యర్థి మోటూరి వేణుగోపాల్ గారు,
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పత్తికొండ కరుణాకర్ రెడ్డి గారు (బి.జె.పి. మద్దతు)

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెంబర్ రాములు గారు పోటిలో ఉన్నారు



Monday, April 29, 2019

పాన్ గల్ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...
పాన్ గల్ మండలంలో మే 14 మూడో విడతలో ....
మన పాన్ గల్ మండలంలో : రిజర్వేషన్లు


Friday, April 26, 2019

వనపర్తి జిల్లా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...

2019 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...
మే 6 మొదటి విడతలో , మే 10 రెండో విడతలో , మే 14 మూడో విడతలో  ఓటింగ్‌ జరగనుంది. 
 పాన్ గల్ మండలంలో  మే 14 మూడో విడతలో ....




Monday, April 8, 2019

Sunday, April 7, 2019

రేమద్దుల లో అంబలి కేంద్రం...

ఈ ఎండాకాలం మన రేమద్దుల ఊరి ప్రజల కోసం డేగ వారి కుటుంబం 06.04.2019 అంబలి కేంద్రం ప్రారంభించారు.  ఎండాకాలం అంబలి ఎంతో మంచిది. కానీ మారిన ఈ కాలం లో అంబలి చాలా తక్కువ మంది కాస్తున్నారు. అంబలి తాగాలి అనిపించిన వాళ్ళందరి కోసం ఈ అంబలి కేంద్రం ఏర్పాటు చేసారు. ఈ అవకాశాన్నిఊరి ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు.
 రేమద్దుల సర్పంచ్ మంజుల,  ఉపసర్పంచి రాంబాబు, వార్డు సభ్యులు కురుమయ్య, హనుమంతు గ్రామస్తులు తిరుపతయ్య,  వెంకట్ రెడ్డి, లోకా రెడ్డి,  గోపాల్ రావు,  చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.      చాలా చాలా మంచి కార్యక్రమం. నిర్వాహకులకు అభినందనలు.




Saturday, April 6, 2019

రేమద్దుల గ్రామంలో 11మందికీ SGT ఉద్యోగాలు...

రేమద్దుల గ్రామంలో 11మంది SGT ఉద్యోగాలు
సాదించిన వీరందరికీ  అభినందనలు ....


ఉగాది పండుగ శుభాకాంక్షలు...

రేమద్దుల గ్రామ ప్రజలకు, విద్యావంతులకు, మిత్రులందరికీ.... 
వికారి నామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు....2019

Friday, April 5, 2019

రేమద్దుల స్కూల్ 34 సంవత్సరాల క్రితం దిగిన ఈ ఫోటో...

రేమద్దుల స్కూల్ 10వ తరగతి ప్రారంభమై 3-4 బ్యాచ్ లు రద్దయ్యాయి. తరువాతి రేమద్దుల లో 1980-81 బ్యాచ్ తిరిగి పదవ తరగతి ప్రారంభమైంది. ఈ బ్యాచ్ నుండి ఇప్పటివరకు పదవ తరగతి వరుసగా నడుస్తున్నది. 
రేమద్దుల స్కూల్ 1980-81 బ్యాచ్...
దాదాపుగా 34 సంవత్సరాల క్రితం దిగిన ఈ ఫోటో 1985లోధనుంజయ్  , పి వెంకటస్వామి, రాజోలు రావు, ఎండి ఖయ్యుం, ఎం విజయబాబు...
వీరితో పాటు బ్యాచ్ లో ప్రభాకర్, వెంకటరమణ,,
రమణారెడ్డి జయమ్మ, రమణ, నారాయణ, నాగిరెడ్డి, బుచ్చి రెడ్డి తదితరులతో దాదాపుగా 30 మంది విద్యార్థులు ఉన్నారు.
ఫోటో పంపించిన ఎం విజయబాబు గారికి ధన్యవాదాలు...


40 సంవత్సరాల క్రితం స్కూల్ లో దిగిన ఫోటో...

రేమద్దుల లో 1978లో మీరు 9వ తరగతి లో దిగిన ఫోటో..
రేమద్దుల స్కూల్ బ్యాచ్ 1979-80. కానీ రేమద్దుల లో అప్పుడు 10 వ తరగతి లేదు.
S Venkataiah, Parameswarachari, NandaKumar, Sulochana, Aruna, Bhanumathy Thirupathaiah, Kurmaiaiah, Rajashekar Shetty, Rangareddy... etc

ఫోటో పంపించిన రంగా రెడ్డి గారికి, నంద కుమార్ గారికి ధన్యవాదాలు.

Wednesday, April 3, 2019

నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు...

నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా మొక్కలు పెంచాలని ఎంపీడీవో సాయి బృంద సూచించారు.
రేమద్దుల లో నర్సరీ ని పరిశీలించారు.



రేమద్దుల హైస్కూళ్లలో డిజిటల్ పాఠాలు...

రేమద్దుల గ్రామ ఉన్నత పాఠశాలలో 16.02.2019 రోజు, "ప్రధాన మంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌(PMGDISHA)" పథకం క్రింద డిజిటల్ అక్షరాస్యతను కల్పించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగినవి. దీనిని "డిజిటల్ ఇండియా ప్రోగ్రాము"లో భాగంగా చేపట్టనున్నారు.

రేమద్దుల గ్రామ సర్పంచ్ మంజుల, మరియు భర్త తిరుపతయ్య గారు , ఎంపీటీసీ వేణు గోపాల్ గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగినది.







గ్రామీణ ఉపాధి హామీ పధకం...సమావేశం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం( MGNREGS)  క్రింద ఈ సంవత్సరం(2019) 100 పని దినములలో చేయించవల్సిన పనుల గురించి చర్చించడానికి సమావేశం 14.02.2019 జరిగింది. రేమద్దుల గ్రామ సర్పంచ్ మంజుల(మరియు భర్త తిరుపతయ్య) గారు అందుబాటులో ఉన్న వార్డ్ మెంబెర్స్ ని, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీలత గారిని, ఎంపీటీసీ వేణు గోపాల్ గారిని మరియు ఇతర ఊరి పెద్దలను పిలవడం జరిగింది. 


బస్సు కోసం విద్యార్థుల ధర్నా...

రేమద్దుల గ్రామంలో  పాఠశాల, కళాశాల సమయంలో అదనపు బస్సు నడపాలని కోరుతూ 11.02.2019 ధర్నా నిర్వహించడం జరిగినది. చాలా మంది విద్యార్థులు ఉండడం వలన ఒక ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళు సకాలంలో కళాశాల, పాఠశాలకు వెళ్లగలుతారు.