Thursday, January 31, 2019

రేమద్దుల గ్రామ సర్పంచ్ గా టిఆర్ఎస్ విజయం...

రేమద్దుల గ్రామ సర్పంచ్ గా (2019)
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోటూరి మంజుల గారు బిజెపి మద్దతుతో విజయం సాధించారు. 
సి.పి.ఎం. పార్టీ అభ్యర్థి గుంటి పద్మ గారి పై 314 ఓట్ల అధిక్యం తో విజయం సాధించారు. 
నూతన సర్పంచ్ మోటూరి మంజుల గారికి శుభాకాంక్షలు....


                విజయం సాదించిన వార్డ్ సభ్యులు   వార్డ్ ల వారిగా...  
2వ వార్డ్  గొంది లక్మమ్మ (భర్త: రామేశ్వర్ రెడ్డి)  TRS
3వ వార్డ్  చింతకుంట లక్ష్మి (భర్త: బ్రహ్మానంద రెడ్డి) TRS
5వ వార్డ్  మహంకాళి హన్మంత్ (తండ్రి: పోషయ్య) TRS
6వ వార్డ్  మోటూరి శివయ్య (తండ్రి: బుడ్డయ్య) TRS
7వ వార్డ్  గంధం రాంబాబు (తండ్రి: బిచ్చన్న) TRS
10వ వార్డ్  గొల్లకుంట రాములమ్మ (భర్త: రాములు) TRS
12వ వార్డ్  సిరిగిరి కురుమయ్య (తండ్రి:నరసింహ) TRS

1వ వార్డ్   రేగుచెట్టు అనురాధ (భర్త: రాజు ) CPM
8వ వార్డ్  కావలి బాలనాగమ్మ ( భర్త: బాలకృష్ణ ) CPM
11వ వార్డ్  ఉద్యాల కాశమ్మ (భర్త: పరమేష్(టీటర్)) CPM

4వ వార్డ్  మల్రెడ్డి బాబురెడ్డి (తండ్రి: కీ.శే. చిన్న బక్కారెడ్డి) BJP
9వ వార్డ్  ఎద్దుల రవీందర్ రెడ్డి (తండ్రి: గంగి రెడ్డి) CONG


                  రేమద్దుల మాజీ సర్పంచులు వారి పార్టీలు,  వివరాలు...
2013 మీ దిండ్ల నాగమ్మ  ( కృష్ణయ్య )  -  సిపిఎం
2007 పోతే దార్ యాదగిరి చారి (స్వామి ఆచారి) - కాంగ్రెస్
...  రేగు చెట్టు అలివేల ( చంద్రయ్య ) - కాంగ్రెస్
...  మహమ్మద్ జబ్బార్  - సిపిఎం
...  ఇట్టే రామ్ రెడ్డి - కాంగ్రెస్

Tuesday, January 29, 2019

సమర్థులను, నీతిమంతులను, ప్రజాసేవకులను గెలిపించండి...రేమద్దుల

రేమద్దుల గ్రామ ప్రజలారా!
మీకందరికి చేతులు జోడించి నమష్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాము.
గ్రామ పంచాయతీ ఓట్ల పండగ రానే వచ్చింది. దయచేసి అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకొని ఓటేయమని మిమ్మల్ని కోరుతున్నాము. ఎన్నికల సమయంలో ఎరవేసే డబ్బు, మందు, తాత్కాలిక మైనవేగాని శాశ్వతమైనవి కాబోవు. మన గ్రామ అభివృద్ధి, మన పల్లెల భవిష్యత్తు మాత్రం శాశ్వతమైనవని మరవకండి.

నేడు జరిగే ఎన్నికల్లో మజా కోసం ఎవరైనా ఆశపడితే
,  5ఏండ్ల పాటు మన బ్రతుకులు అంధకారం అవుతాయని గమనించండి.
అసమర్థులను, అవినీతిపరులను, ప్రజా సమస్యలపట్ల అవగాహణ, శుద్ధిలేని వారిని ఓడించండి.
సమర్థులను, నీతిమంతులను, ప్రజాసేవకులను గెలిపించండి.

Friday, January 18, 2019

రేమద్దుల గ్రామంలో సంక్రాంతి క్రీడోత్సవాలు...

రేమద్దుల గ్రామంలో 2019 సంక్రాంతి పండుగ సందర్భంగా SFI DYFI సంఘాల ఆద్వర్యంలో  క్రీడోత్సవాలను నిర్వహించారు.    క్రీడోత్సవాలను మోటూరి వేణుగోపాల్(ఎంపీటీసీ) ప్రారంభించినారు.
 క్రికెట్,వాలిబాల్  నిర్వహించినారు. క్రికెట్ టోర్నమెంట్లో బానుప్రకాష్  జట్టు 1st ￰ప్రైజ్, శేకర్ జట్టు 2nd ￰ప్రైజ్ గెలవటం జరిగింది.  
 నాయకులు గుంటి వెంకటయ్య, ఫయాజ్, రేగిచెట్టు నిరంజన్, ఆంజనేయులు, బాల్ రెడ్డి  మరియు గ్రామ యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు..... 

 శేకర్ జట్టు 2nd ￰ప్రైజ్

Thursday, January 17, 2019

రేమద్దుల లో 2019 సంక్రాంతి సంబరాలు...

గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు...
రేమద్దుల లో జరిగిన 2019 సంక్రాంతి సంబరాలు... 
పాన్ గల్ మండలం, వనపర్తి జిల్లా.


Wednesday, January 9, 2019

ఊరు అబివృద్ది కోసం రమేష్ అవేదన... రేమద్దుల

రమేష్ కి ధన్యవాదములు. 
రమేష్ ప్రయాత్నం మంచిది. 
మన రమేష్ అవేదన చూడండి.......
ఊరు అబివృద్ది కోసం అందరు అలోచన చేయండి.
గ్రామ అభివృద్ధికి నిజంగా పని చేసేవారికి అవకాశం ఇద్దాం 
గ్రామా అభివృద్ధి చేసుకుందాం


Saturday, January 5, 2019

పాన్ గల్ మండలంలో : పంచాయతీ ఎన్నికలు, రిజర్వేషన్లు...

2019 పంచాయతీ ఎన్నికలు : రిజర్వేషన్లు, వనపర్తి జిల్లా
మన పాన్ గల్ మండలంలో : రిజర్వేషన్లు , పంచాయతీ ఎన్నికలు





Wednesday, January 2, 2019

మా ఊరి ఎన్నికలు...

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల :
మూడు విడతలుగా
ఈనెల 7 నుంచి 21వరకూ మెదట విడత,
11 నుంచి 25 వరకు రెండో విడతలో
16 నుంచి 30 వరకూ మూడో విడతగా
మన పాన్ గల్ మండలంలో మూడో విడతగా పంచాయతీ ఎన్నికలు




Tuesday, January 1, 2019

కొత్త అడుగులతో...రేమద్దుల

కొత్త అడుగులతో... కొత్త సంవత్సరంలోకి వేళ్ళాదాం...
మన ఊరికి మనం ఏమి ఇస్తున్నాం..., ఏమి ఇవ్వగలం... , 
ఆలోచించండి. ఎన్నో మార్గాలు వున్నాయి...

చిన్న పని సైతం ఊరి మార్పుకు కొంత అయిన ప్రభావం చూపుతుంది. సమస్యలపై దృష్టిపెట్టి, స్పందించగలుగుతే చాలు... పరిష్కారాలు ప్రారంభమౌతాయి...