Sunday, February 17, 2019

స్వయం పరిపాలన దినోత్సవం ... రేమద్దుల గ్రామంలో

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేమద్దుల గ్రామంలో 13.02.2019 న
2018-19 బ్యాచ్వి ద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం జ‌రుపుకున్నారు. ఈ కార్యక్ర‌మంలో భాగంగా విద్యార్థులు స్వయంగా పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మోటూరి మంజుల గారు, మోటూరి తిరుపతయ్య గారు ముఖ్య అతిధులుగా హాజరయినారు.విద్యార్థులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని లత గారు , సర్పంచి మోటూరి మంజుల గారు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచి గెలిచిన వారికీ శుభకాంక్షలు తెలియజేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు మాట్లాడుతూ, స్కూల్ కొత్త భవనానికి నిధులు మరియు ఇంగ్లీష్ మీడియం గురుంచి విద్యా వాలంటీర్స్ ఏర్పాటు చేయడానికి సహకరించవలిసిందిగా సర్పంచిని కోరడం జరిగింది.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయులు అందరు కలిసి నూతన సర్పంచిని శాలువ మరియు పూలమాలతో సత్కరించారు.




Wednesday, February 13, 2019

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని బహూకరించారు....

రేమద్దుల గ్రామంలో పదవ తరగతి విద్యార్థులకు 2005 - 06 సంవత్సరపు పూర్వ విద్యార్థులు పరీక్ష సామాగ్రిని బహూకరించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎం లత గారు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు రాజేందర్, రాములమ్మ, చంద్రయ్య, ఒరే రాములు బాలమ్మ, రామచంద్రయ్య లు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులకు హెచ్ఎం లత గారు అభినందనలు తెలియజేశారు.



Saturday, February 2, 2019

రేమద్దుల నూతన గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారము...

రేమద్దుల నూతన గ్రామ సర్పంచ్ గా మోటూరి మంజుల తిరుపతయ్య గారి
 ప్రమాణస్వీకారణమహోత్సవం...02.02.2019