Saturday, January 13, 2018

రేమద్దుల గ్రామములో విద్యా వంతుల సభ ... Remaddula

రేమద్దుల గ్రామములోని విద్యా వంతులైన పెద్దలు, యువకులు, 
పూర్వ విద్యార్థులైన వారు 10.01.2018 సభ నిర్వహించడం మంచి పరిణామము. 
విద్యార్థుల అబివృద్ధికి బాగా ఉపయేగపడుతుంది... అభిందనియం. 
పదవ తరగతి విద్యార్థులకు అవసరమయ్యే కెరీర్ గైడెన్స్ & పాలిటెక్నిక్ విద్యకు కావలసిన పుస్తకాలు మరియు అర్హులైన విద్యార్థులకు ఉచిత POLYCET శిక్షణ, అవసరం ఉన్న వారికి వసతి సౌకర్యం కల్పించడానికి ముందుకు  
వచ్చిన KYF (Kollapur Youth Federation ) వ్యవస్థాపకులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారికి (వైస్ చైర్మన్ & MD,తెలంగాణ రాష్ట్ర ఇంధన వనరుల పునరుద్ధరణీయ సంస్థ ) అభినందనలు
యువకులు, పూర్వ విద్యార్థులు ఎక్కువగా మంది వస్తే ఇంకా బాగవుందేది....







Thursday, November 23, 2017

ఫంక్షన్ లో కలిసిన స్కూల్‌ స్నేహితుల బృందం...

కె. రాము కుటుంబముతో ... 
ఒక ఫంక్షన్ లో హైదరాబాద్ లో కలిసిన 
రేమద్దుల స్కూల్‌ 1991-92 బ్యాచ్‌ స్నేహితుల బృందం...




Thursday, June 22, 2017

పాఠశాలకు రూ॥ 25,000 విలువగల బెంచీలను బహుకరణ...

వనపర్తి జిల్లా , పాన్ గల్ మండలంలోని ' రేమద్దుల స్కూలు' 
1991-92 బ్యాచ్‌ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం 14.05.2017 న ఘనంగా జరిగింది.
ఆ రోజు సమ్మేళనం లో అనుకున్నట్లుగా ఈ రోజు ( 22.06.2017 ) 
1991-92 బ్యాచ్‌ విధ్యార్థులు రూ॥ 25,000 విలువగల బెంచీలను, 
రేమద్దుల పాఠశాల GHM జె. లత గారు మరియు ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది.




Friday, June 16, 2017

రేమద్దుల గ్రామంలో ట్రాఫిక్‌ జామ్‌...

వనపర్తి జిల్లా, పాన్‌గల్‌ మండలంలోని రేమద్దుల గ్రామంలో
పెద్దమ్మ పండుగ 2017 మే 14-16 తేదీలలో చాల చాల ఘనంగా జరిగింది.
దాదాపు 24 సం|| ల తరువాత ఇప్పుడు మహా జాతర కంటే గొప్పగా జరుపుకున్నారు.
రేమద్దుల గ్రామంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది అంటే ఏవరు నమ్మరు.
కాని ఇది నిజము. దాదాపు 15,000 నుండి 20,000 మంది వరకు హాజరై వుంటారు.
ఊరులో ఎటు చూసిన రెండు, మూడు రోజులు గళగళలాడింది.
ప్రతి ఇంటికి ఒక టేంట్‌, 20-50 కుర్చిలు. ఒకటి లేదా రెండు మేకలు.
 ఏ ఇళ్ళు చూసిన కార్లులు, బైకులు, టాక్టర్లు... ఈలా ఊరంత సంతోషాలు, సంబరాలు మిన్నంటాయి.
 ఊరిలో ఏ ఇంటిని చూసిన వారి అందరి బంధువులు పండుగకు హాజరైనారు.
దానితో ప్రతి ఇళ్ళు కళకళలాడింది.
చాల మంది ప్రత్యక్షంగా ఏప్పుడు చూడనందువల్ల ఈ పండుగ గురించి పూర్తిగా తెలియలేదు.
ఇప్పుడు ఈ పండుగతో ఆ తరం వారికి, ఈ తరం వారికి అందరికి తెలిసినట్లు అయ్యింది.
ఆ తరువాత చాల గ్రామాలు చేయడం ప్రారంభించాయి. ఇప్పటికి చేస్తునే వున్నారు.