భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురు ల అమరవీరుల దినం
మార్చ్ 23 న, స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురులు దేశం కోసం అమరులైన రోజున
రేమద్దుల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అమరవీరుల దినం జరుపుకోవడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా SI రాములు, భగత్ మరియు భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగినది.
రేమద్దుల 7 వార్డ్ లో గెలిచిన గంధం రాంబాబు S/O బిచ్చన్న గారి చేత
18.02.2019 (సోమవారం) ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ఉప సర్పంచిగా ధ్రువపరుస్తూ
ఉపసర్పంచ్ ఎన్నిక ధ్రువపత్రాన్ని పత్రాన్ని అందచేయడం జరిగినది.
ఈ సమావేశానికి సర్పంచ్ మోటూరి మంజుల గారు హాజరు అయ్యారు.
విద్యార్థులలో చట్టసభల పై అవగాహన కల్పించడానికి
14 మార్చి 2019న హైస్కూల్లో మాకు అసెంబ్లీ నిర్వహించారు.
రేమద్దుల 1991-92 బ్యాచి విద్యార్థిని శ్రీమతి సుభాషిని గారి
అబ్బాయి సీ లోకేష్ కు బి ఈ (ఇంజనీరింగ్ ) ఫస్ట్ ఇయర్ లో '' గోల్డ్ మెడల్ '' సాధించారు. హైదరాబాదులోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. ( శ్రీమతి సుభాషిని తండ్రి పేరు రామస్వామి )
వారికి, వారి కుటుంబ సభ్యులకు మనందరి తరపున శుభాకాంక్షలు...
రేమద్దుల స్కూలు 2018-19 సం.10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు సభ వారి ఫోటోలు...విద్యార్థులకు హల్ టికెట్స్ అందిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 50 మంది విద్యార్థిని,విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ...
వివిధ జిల్లాల నుండి 11 ఎద్దుల జతలు పాల్గొన్నాయి.
మహాశివరాత్రి సందర్భంగా రేమద్దుల లో రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలు 05.03.2019 నిర్వహించారు. రేమద్దుల సర్పంచ్ మంజుల తిరుపతయ్య గారు ప్రారంభించారు.
ఈ పోటీలలో గద్వాల జిల్లా శ్రావణ గండ్ల చక్రధర్ గౌడ్ ఎద్దులు 3927 ఫీట్లు లాగి మొదటి బహుమతి పొందాయి. గద్వాల జిల్లా ఇందువాసి వీరేశం గౌడ్ ఎద్దులు 3750 ఫీట్లు లాగి రెండో బహుమతి పొందాయి. నాగర్ కర్నూల్ జిల్లా చంద్రకల్ వెంకటేశ్వరరావు చెందిన ఎద్దులు 3582 ఫీట్లు లాగి మూడో స్థానం గెలుచుకున్నాయి.
ఈ పోటీలలో ఉపసర్పంచి రాంబాబు, రైతు మిత్ర సభ్యులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రేమద్దుల గ్రామంలో 26.02.2019 న ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థులు, ఉపాధ్యాయులు జరుపుకున్నారు. మోటూరి తిరుపతయ్య గారు, ఉపసర్పంచ్ గంధం రాంబాబు గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయులు అందరు కలిసి నూతన సర్పంచి , ఉపసర్పంచ్ లను శాలువ మరియు పూలమాలతో సత్కరించారు.