రేమద్దుల లో 1978లో మీరు 9వ తరగతి లో దిగిన ఫోటో..
రేమద్దుల స్కూల్ బ్యాచ్ 1979-80. కానీ రేమద్దుల లో అప్పుడు 10 వ తరగతి లేదు.
S Venkataiah, Parameswarachari, NandaKumar, Sulochana, Aruna, Bhanumathy Thirupathaiah, Kurmaiaiah, Rajashekar Shetty, Rangareddy... etc
ఫోటో పంపించిన రంగా రెడ్డి గారికి, నంద కుమార్ గారికి ధన్యవాదాలు.
నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా మొక్కలు పెంచాలని ఎంపీడీవో సాయి బృంద సూచించారు.
రేమద్దుల లో నర్సరీ ని పరిశీలించారు.
రేమద్దుల గ్రామ ఉన్నత పాఠశాలలో 16.02.2019 రోజు, "ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్(PMGDISHA)" పథకం క్రింద డిజిటల్ అక్షరాస్యతను కల్పించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగినవి. దీనిని "డిజిటల్ ఇండియా ప్రోగ్రాము"లో భాగంగా చేపట్టనున్నారు.
రేమద్దుల గ్రామ సర్పంచ్ మంజుల, మరియు భర్త తిరుపతయ్య గారు , ఎంపీటీసీ వేణు గోపాల్ గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగినది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం( MGNREGS) క్రింద ఈ సంవత్సరం(2019) 100 పని దినములలో చేయించవల్సిన పనుల గురించి చర్చించడానికి సమావేశం 14.02.2019 జరిగింది. రేమద్దుల గ్రామ సర్పంచ్ మంజుల(మరియు భర్త తిరుపతయ్య) గారు అందుబాటులో ఉన్న వార్డ్ మెంబెర్స్ ని, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీలత గారిని, ఎంపీటీసీ వేణు గోపాల్ గారిని మరియు ఇతర ఊరి పెద్దలను పిలవడం జరిగింది.
రేమద్దుల గ్రామంలో పాఠశాల, కళాశాల సమయంలో అదనపు బస్సు నడపాలని కోరుతూ 11.02.2019 ధర్నా నిర్వహించడం జరిగినది. చాలా మంది విద్యార్థులు ఉండడం వలన ఒక ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళు సకాలంలో కళాశాల, పాఠశాలకు వెళ్లగలుతారు.
'అభినవ శూరుడా ' అంటూ పాకిస్తాన్ అదుపులో ఉండి ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ను తలుచుకుంటూ రాసిన కవిత.
గోపాల శివ (S/O గోపాల మల్లయ్య )
రేమద్దుల SSC 2005-06 బ్యాచ్
ప్రస్తుతం గోపాల శివ 99 టీవి హైదరాబాద్ హెడ్ ఆఫీసులో వీడియో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు.అభినవ శూరుడా !
వీరుడా అభినవ శూరుడా..
తోడేళ్ళ మందకు ఆహారం
అవుతున్నావని తెలిసినా
అదరక బెదరక తలవంచక
సింహమై గర్జించిన నీ ధీరత్వానికి
యావత్ భారతం సలాం కొడుతోంది..
రాబందుల రాజ్యంలో
ఆ రాకాసుల చేతుల్లో
ముఖమంతా రుధిరంతో
బతుకును పణంగా పెట్టి
జైహింద్ అన్న నీ పరాక్రమానికి
అశేతు హిమాచలం
మంచు వర్షం కురిపిస్తోంది
భారతమ్మ బిడ్డల నుదుట
సింధూరాన్ని తుడిపేసిన
విషనాగుల చెరలో నీవున్నా
మొక్కవోని ధైర్య సాహసంతో
సవాల్ విసిరిన నీ పరాక్రమం
120 కోట్ల అభిమానుల
గుండె చప్పుడై మారుమోగుతోంది.
సింహం ఎక్కడున్నా సింహమేరా
ఈ కళ్ళల్లో మండుతున్న అగ్ని ధాటికి
మీ అరాచక శక్తులు బూడిద కాక తప్పదురా..
శత్రువులకు దడపుట్టించి
మాతృభూమికి తిరిగివస్తున్న
వీరుడా వందనం..
ధీరుడా అభివందనం...🙏
జై హింద్ జై జవాన్ జై జై జవాన్
పరువు హత్యలెందుకు?... అంటూ సమాజంలో పరువు హత్యలెందుకు జరుగుతున్నాయి అంటూ ప్రశ్నిస్తూ, అంబేద్కర్, పూలే లాంటి మహనీయుల చిత్ర పటాలకు దండలు వేయడమే కాదు వారి ఆశయాలకు అణువుగా నడుచుకోవాలని ఆర్టికల్ రాశాడు.
విజయ్ ఆత్మకూరి (S/O కోదండ రాములు)
రేమద్దుల SSC -2001-2002 బ్యాచ్