Wednesday, April 3, 2019

విజయ్‌ కుమార్‌ శెట్టి గారికి అశ్రూనివాలి...

కీ.శే, వీర భద్రయ శెట్టి కుమారుడు
విజయ్‌ కుమార్‌ శెట్టి గారికి
అశ్రూనివాలి  13.02.2017


పెండ్లి లో కలసిన స్కూల్ జ్ఙాపకాలు...

రేమద్దుల గ్రామ వాస్తవ్యులు పి. వెంకటస్వామి కుతూరు పెండ్లి 
సందర్బంగా 28.02.2016 న తాళ్లగడ్డ లో(జానంపేట్ దగ్గర )
దిగిన 1991-1992 బ్యాచ్ ఫొటోలు ...




Tuesday, April 2, 2019

ఉపాధి పనుల వద్ద సౌకర్యాలు కల్పించాలి...

ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని 
రేమద్దుల ఎంపీటీసీ వేణుగోపాల్ గారు డిమాండ్ చేశారు...


Monday, April 1, 2019

భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడు...

రేమద్దుల లో మార్చ్ 23 న యువ నాయకులు,  యువకులు భగత్ సింగ్ విగ్రహానికి పుష్పగుచ్ఛము వేసి జోహార్లు అర్పించారు.స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురులు దేశం కోసం అమరులైన రోజున అమరవీరుల దినం జరుపుకోవడం జరిగినది. భగత్‌సింగ్‌ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు. 'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి.  వారి స్ఫూర్తితో సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత,  మానవత్వం, మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి.


భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురు ల అమరవీరుల దినం...

భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురు ల అమరవీరుల దినం
మార్చ్ 23 న, స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురులు దేశం కోసం అమరులైన రోజున
రేమద్దుల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అమరవీరుల దినం జరుపుకోవడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా SI రాములు, భగత్ మరియు భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగినది.


రేమద్దుల ఉపసర్పంచ్ గా గంధం రాంబాబు...

రేమద్దుల 7 వార్డ్ లో గెలిచిన గంధం రాంబాబు S/O బిచ్చన్న గారి చేత 
18.02.2019 (సోమవారం) ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ప్రమాణ స్వీకారం చేయించారు. 
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ఉప సర్పంచిగా ధ్రువపరుస్తూ 
ఉపసర్పంచ్ ఎన్నిక ధ్రువపత్రాన్ని పత్రాన్ని అందచేయడం జరిగినది. 
ఈ సమావేశానికి సర్పంచ్ మోటూరి మంజుల గారు హాజరు అయ్యారు.



రేమద్దుల లో మాక్ అసెంబ్లీ...

విద్యార్థులలో చట్టసభల పై అవగాహన కల్పించడానికి 
14 మార్చి 2019న హైస్కూల్లో మాకు అసెంబ్లీ నిర్వహించారు.