Friday, June 16, 2017

రేమద్దుల గ్రామంలో ట్రాఫిక్‌ జామ్‌...

వనపర్తి జిల్లా, పాన్‌గల్‌ మండలంలోని రేమద్దుల గ్రామంలో
పెద్దమ్మ పండుగ 2017 మే 14-16 తేదీలలో చాల చాల ఘనంగా జరిగింది.
దాదాపు 24 సం|| ల తరువాత ఇప్పుడు మహా జాతర కంటే గొప్పగా జరుపుకున్నారు.
రేమద్దుల గ్రామంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది అంటే ఏవరు నమ్మరు.
కాని ఇది నిజము. దాదాపు 15,000 నుండి 20,000 మంది వరకు హాజరై వుంటారు.
ఊరులో ఎటు చూసిన రెండు, మూడు రోజులు గళగళలాడింది.
ప్రతి ఇంటికి ఒక టేంట్‌, 20-50 కుర్చిలు. ఒకటి లేదా రెండు మేకలు.
 ఏ ఇళ్ళు చూసిన కార్లులు, బైకులు, టాక్టర్లు... ఈలా ఊరంత సంతోషాలు, సంబరాలు మిన్నంటాయి.
 ఊరిలో ఏ ఇంటిని చూసిన వారి అందరి బంధువులు పండుగకు హాజరైనారు.
దానితో ప్రతి ఇళ్ళు కళకళలాడింది.
చాల మంది ప్రత్యక్షంగా ఏప్పుడు చూడనందువల్ల ఈ పండుగ గురించి పూర్తిగా తెలియలేదు.
ఇప్పుడు ఈ పండుగతో ఆ తరం వారికి, ఈ తరం వారికి అందరికి తెలిసినట్లు అయ్యింది.
ఆ తరువాత చాల గ్రామాలు చేయడం ప్రారంభించాయి. ఇప్పటికి చేస్తునే వున్నారు.


No comments:

Post a Comment