Saturday, March 30, 2019

రేమద్దుల అబ్బాయి లోకేష్ కి '' గోల్డ్ మెడల్ ''...

రేమద్దుల 1991-92 బ్యాచి విద్యార్థిని శ్రీమతి సుభాషిని గారి 
అబ్బాయి సీ లోకేష్ కు బి ఈ (ఇంజనీరింగ్ ) ఫస్ట్ ఇయర్ లో '' గోల్డ్ మెడల్ '' సాధించారు. హైదరాబాదులోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. ( శ్రీమతి సుభాషిని తండ్రి పేరు రామస్వామి )
వారికి, వారి కుటుంబ సభ్యులకు మనందరి తరపున శుభాకాంక్షలు...


Monday, March 25, 2019

రేమద్దుల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ...

రేమద్దుల స్కూలు 2018-19 సం.10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు సభ వారి ఫోటోలు...విద్యార్థులకు హల్ టికెట్స్ అందిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 50 మంది విద్యార్థిని,విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ...







Thursday, March 7, 2019

అట్టహాసంగా... రేమద్దుల లో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు...

వివిధ జిల్లాల నుండి 11 ఎద్దుల జతలు పాల్గొన్నాయి.
మహాశివరాత్రి సందర్భంగా రేమద్దుల లో రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో బండలాగుడు  పోటీలు 05.03.2019 నిర్వహించారు. రేమద్దుల సర్పంచ్ మంజుల తిరుపతయ్య గారు ప్రారంభించారు.
 ఈ పోటీలలో గద్వాల జిల్లా శ్రావణ గండ్ల చక్రధర్ గౌడ్ ఎద్దులు 3927 ఫీట్లు లాగి మొదటి బహుమతి పొందాయి. గద్వాల జిల్లా ఇందువాసి వీరేశం గౌడ్ ఎద్దులు 3750 ఫీట్లు లాగి రెండో బహుమతి పొందాయి. నాగర్ కర్నూల్ జిల్లా చంద్రకల్ వెంకటేశ్వరరావు చెందిన ఎద్దులు 3582 ఫీట్లు లాగి మూడో స్థానం గెలుచుకున్నాయి. 
ఈ పోటీలలో ఉపసర్పంచి రాంబాబు, రైతు మిత్ర సభ్యులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




Friday, March 1, 2019

రేమద్దుల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం...

రేమద్దుల గ్రామంలో 26.02.2019 న ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థులు, ఉపాధ్యాయులు జ‌రుపుకున్నారు.  మోటూరి తిరుపతయ్య గారు, ఉపసర్పంచ్ గంధం రాంబాబు గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు తదితరులు పాల్గొన్నారు.     
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయులు అందరు కలిసి నూతన సర్పంచి , ఉపసర్పంచ్ లను శాలువ మరియు పూలమాలతో సత్కరించారు.